లాక్ డౌన్ పెట్టకపోతే ఇంతే…కేంద్రంపై పెరుగుతున్న వత్తిడి

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టాలన్న డిమాండ్ పెరగుతోంది. సెకండ్ వేవ్ లో కరోనా కేసులు పెరుగుతుండటం, మరణాల సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతుండటంతో లాక్ డౌన్ [more]

Update: 2021-05-05 01:00 GMT

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టాలన్న డిమాండ్ పెరగుతోంది. సెకండ్ వేవ్ లో కరోనా కేసులు పెరుగుతుండటం, మరణాల సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతుండటంతో లాక్ డౌన్ పెట్టాలని అన్ని వర్గాలు కోరుతున్నాయి. అఖిల భారత వ్యాపారుల సమాఖ్య ఈమేరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తాము జరిపిన సర్వేలో 67 శాతం మంది లాక్ డౌన్ ను కోరుకుంటున్నారని తెలిపింది. లాక్ డౌన్ పెట్టకుంటే పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉందని సూచించింది. లాక్ డౌన్ సమయంలో నిత్యావసరాల వస్తువులు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాపారుల సంఘం పేర్కొంది. కనీసం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనైనా లాక్ డౌన్ ను విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

Tags:    

Similar News