రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు రజనీకాంత్ ప్రకటించినా ఇంకా పార్టీ పేరు కూడా ప్రకటించలేదు. కానీ, అప్పుడే రజనీ పార్టీపై తమిళనాట అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. డబ్బులు ఉన్న వారికే రజనీకాంత్ పార్టీలో పదవులు దక్కుతాయని తమిళనాడులో ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై రజనీకాంత్ స్వయంగా స్పందించి ఖండించారు. వ్యవస్థలో మార్పు కోసం ఏర్పాటు చేస్తున్న తన పార్టీలోకి డబ్బులు, పదవులు ఆశించే వారు రావద్దని స్పష్టం చేశారు. త్వరలోనే పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.