Hyderabad : ఢిల్లీకి పోటీగా హైదరాబాద్.. సిటీలో ఎక్కడెక్కడ డేంజర్ ప్లేస్ లు అంటే?
చల్లటి గాలులతో పాటు వాయు కాలుష్యం కూడా నగరాల్లో విపరీతంగా పెరిగిపోతుంది. హైదరాబాద్ కూడా డేంజర్ బెల్స్ మోగిస్తుంది.
ఒకవైపు చల్లటి గాలులతో పాటు వాయు కాలుష్యం కూడా నగరాల్లో విపరీతంగా పెరిగిపోతుంది. హైదరాబాద్ కూడా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఢిల్లీతో సమానంగా హైదరాబాద్ లో కూడా వాయు కాలుష్యం పెరిగిపోతుంది. ఇలాగే కొనసాగితే హైదరాబాద్ కూడా ఢిల్లీకి అతి త్వరగా చేరువయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోయాయి. దీంతో ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాంక్రీట్ జంగిల్ గా మారిన నగరంలో అనేక కారణాలు వాయు కాలుష్యానికి కారణాలుగా అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే వ్యాధుల బారిన పడతారని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్...
హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాయు కాలుష్యం పెరిగిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోయాయి. ప్రధానంగా కూకట్ పల్లి, మూసాపేట, బాలానగర్, నాంపల్లి, మొహిదీపట్నంలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం చేరుకుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ప్రయాణించే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వీలయితే మాస్క్ లను ధరించడం ఉత్తమమని చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో పాటు ఒక్కసారిగా వాయు కాలుష్యం పెరిగిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న వారు బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
అధికారులు చర్యలు...
ఈ ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మూడు వందలకు క్రాస్ అయిందని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత కాలుష్యం పెరిగే అవకాశముందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఢిల్లీతో సమానంగా వాయు కాలుష్యం నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కాలుష్య నియంత్రణ మండలి హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రధానంగా వయో వృద్ధులు, శాసకోశ వ్యాధులున్నవారు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.