ఆమంచి చిచ్చు: చీరాలలో సంబరాలు.. నిరసనలు
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం చీరాలలో రాజకీయవేడిని అమాంతం పెంచేసింది. బలమైన నేతగా [more]
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం చీరాలలో రాజకీయవేడిని అమాంతం పెంచేసింది. బలమైన నేతగా [more]
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం చీరాలలో రాజకీయవేడిని అమాంతం పెంచేసింది. బలమైన నేతగా ఉన్న కృష్ణమోహన్ ను పార్టీలోనే కొనసాగేలా చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో నష్టనివారణలో భాగంగా ప్రత్యామ్నాయం కోసం చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. రేపు చీరాలలో కార్యకర్తల సమావేశం నిర్వహించాలని సీనియర్ నేత కరణం బలరాంను ఆదేశించారు. మరోవైపు కృష్ణమోహన్ కు వ్యతిరేకంగా ఉన్న టీడీపీ నేతలు ఆయన పార్టీకి రాజీనామా చేయడంతో చీరాలలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. మరోవైపు ఆమంచి చేరిక స్థానిక వైసీపీ నేతల్లోనూ అసంతృప్తి రాజేసింది. వైసీపీలో ఆమంచి చేరికను నిరసిస్తూ చీరాల వైసీపీ సమన్వయకర్త యడం బాలాజీ అనుచరులు ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు.