బాబు పాపం పండింది
టీడీపీ అధినేత చంద్రబాబు పాపం పండిందని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగితే చంద్రబాబు, లోకేష్ లు ఇద్దరూ హైదరాబాద్ [more]
;
టీడీపీ అధినేత చంద్రబాబు పాపం పండిందని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగితే చంద్రబాబు, లోకేష్ లు ఇద్దరూ హైదరాబాద్ [more]
టీడీపీ అధినేత చంద్రబాబు పాపం పండిందని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగితే చంద్రబాబు, లోకేష్ లు ఇద్దరూ హైదరాబాద్ వెళ్లి వ్యవస్థలను మ్యానేజ్ చేస్తున్నారని అంబటి ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ బినామీలపైనే ఐటీ దాడులు జరిగాయన్నారు. చంద్రబాబు బండారం మొత్తం త్వరలోనే బయటపడపోతుందని అంబటి తెలిపారు. ఒక్క మాజీ పీఎస్ దగ్గరే రెండు వేల కోట్లు దొరికితే ఇంకెంత సొమ్మును చంద్రబాబు అక్రమంగా సంపాదించారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఐటీ దాడులపై ప్రజల దృష్టి మరల్చడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు తోక పత్రికలు కూడా ఈ విషయాన్ని హైలెట్ చేయకుండా జగన్ పై బురద జల్లే కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తున్నాయన్నారు. ఆ రెండు పత్రికలను ప్రజలు నమ్మడం మానేశారని అంబటి రాంబాబు అన్నారు. ఐటీ దాడులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్, సీపీఐ నేత రామకృష్ణ ఎందుకు మాట్లాడటం లేదని అంబటి ప్రశ్నించారు.