India : ముందు కోచ్ ను తప్పిస్తే తర్వాత అంతా మంచే జరుగుతుందట

టీం ఇండియా వరస వైఫల్యానికి కారణం జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కారణమన్న కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువ వినిపిస్తున్నాయి;

Update: 2025-01-04 05:30 GMT


 



టీం ఇండియా వరస వైఫల్యానికి కారణం జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కారణమన్న కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువ వినిపిస్తున్నాయి. 2024 కు ముందు వరకూ వరస విజయాలను అందించిన టీం ఇండియా జట్టు ఆ తర్వాత నుంచి ఎందుకు వరస ఓటములను చవి చూడాల్సి వస్తుందన్న కారణాలన్నీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైపు చూపిస్తున్నాయి. గౌతమ్ గంభీర్ కోచ్ గా అపాయింట్ మెంట్ అయిన నాటి నుంచే జట్టుకు శని పట్టుకుంది. శ్రీలంక వన్డే సిరీస్ ను టీం ఇండియా చేజార్చుకుంది. సొంత గడ్డపై న్యూజిలాండ్ పై టెస్ట్ సిరీస్ లో భారత్ వైట్ వాష్ అయింది. తాజాగా ఆస్ట్రేలియా టూర్ లో కూడా టీం ఇండియా జట్టు పేలవమైన ప్రదర్శన చూపుతుంది.

బాగా ఆడిన జట్టు ఇలా...
2024 వరకూ బాగా ఆడిన జట్టు ఇలా డీలా పడిపోవడానికి కారణాలపై అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి. సిడ్నీ టెస్ట్ లో గెలిచినా భారత్ కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకోవడం కష్టమే. అసలు శ్రీలంక తో వన్డే సిరీస్ ఓటమి పాలయినప్పుడే దీనిపై సమీక్ష చేసుకోవాల్సి ఉంది. గతంలో రవి శాస్త్రి, రాహుల్ ద్రావిడ్ కోచ్ లుగా ఉన్నప్పుడు ఎందుకు విజయాలు దక్కాయి? ఇప్పుడు ఎందుకు సక్సెస్ రేటు అసలు లేదనడానికి గౌతమ్ గంభీర్ కారణమన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి. కేవలం రాజకీయ కారణాలతోనే గౌతమ్ గంభీర్ ను హెడ్ కోచ్ గా తెచ్చిపెట్టి మనంతట మనమే ముప్పు తెచ్చుకున్నామన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

రాహుల్ ద్రావిడ్ కోచ్ గా...
రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ప్లేయర్స్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చంపేవాడు కాదు. ఆడని వాళ్ళను పర్సనల్ గా తీసుకుని ట్రైన్ చేసేవాడు. స్కిల్ పెంచే వాడు. జైస్వాల్, పంత్ ఇలాగే టెక్నిక్స్ పెంచుకున్నారు. స్కిల్ ఉంది అంటే...బాగా రుద్దేవాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ద్రావిడ్ ఉంటే కెప్టెన్ వర్క్ ఈజీ అయిపోయేది. గౌతమ్ గంభీర్ ఎక్కడ దొరికాడో గాని.. ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ అందరికీ వీక్నెస్ ఉన్నప్పుడు... దాని మీద ఫోకస్ పెట్టాలి. ఐపిఎల్ గ్యాంగ్ మొత్తాన్ని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో సోది కొట్టడంతోనే సరిపోతుంది. పుజారా, రహానేని కోచ్ పట్టుబడితే పంపరా...? సెలెక్టర్లు వద్దు అన్నారట. ప్లేయర్ ను అడిగి సాధించుకోలేని వాడు వీడు కోచ్ ఎలా అవుతాడు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
నాచురల్ గేమ్ ను...
రిషబ్ పంత్ లాంటి ఆటగాడి న్యాచురల్ గేమ్ ను గౌతమ్ గంభీర్ చంపేసాడు. ఎంత కాన్ఫిడెంట్ గా ఆడేవాడు పంత్. పుష్ప సినిమాలో అన్నట్టు బౌలర్లకు గజ్జలు వణుకుతాయి పంత్ క్రీజ్ లో ఉంటే. రవిశాస్త్రి కూడా పట్టుదలగా ఆడించాడు టీంను. టెక్నిక్ డెవలప్ చేశాడు. టీంలో ఆడే ప్రతీ ఒక్కడు.. ద్రావిడ్ దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్ళే. ఫీల్డింగ్ మీద ఫోకస్ చేసేవాడు. అందుకే రోహిత్ అడిగాడు. కోచ్ గా ఉండమని. చిల్లర రాజకీయాలు బోర్డ్ లోకి ఎంటర్ అయితే ఇలాగే ఉంటుంది. ఆస్ట్రేలియాలో వరుసగా రెండు సార్లు సీరీస్ గెలిచారు... ఇప్పుడు ఇలాంటి పరిస్థితి.నీకో దండం రా దూత.. కావాలంటే కేకేఆర్ కప్ ఇంకో పది సార్లు కొనుక్కో... కాని నేషనల్ టీం నుంచి పోనాయనా అంటూ ఒక నెటిజన్ వేసిన సెటైర్ సోషల్ మీడియాలో హోరెత్తి పోతుంది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News