బాబు బ్యాలన్స్ తప్పుతున్నారు

ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ వ్యవహారం ప్రభుత్వానికి సంబంధించిందని, అది రొటీన్ వ్యవహారమని వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఒక అధికారి తప్పు [more]

;

Update: 2019-12-14 10:59 GMT

ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ వ్యవహారం ప్రభుత్వానికి సంబంధించిందని, అది రొటీన్ వ్యవహారమని వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఒక అధికారి తప్పు చేస్తే సస్పెండ్ చేయక సన్మానిస్తారా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. జాస్తి కిషోర్ జగతి పబ్లికేషన్స్ పై ఐటీ దాడులు చేయబట్టే తాము కక్ష సాధింపు చర్యలకు దిగామని చంద్రబాబు చేస్తున్నవి తప్పుడు ఆరోపణలన్నారు. నిజానికి జగతి పబ్లికేషన్స్ పై దాడులు చేయడం వల్లనే జాస్తి కిషోర్ ను కేంద్ర సర్వీసుల నుంచి చంద్రబాబు ఏపీికి తీసుకొచ్చాడేమోనన్న అనుమానం ఇప్పుడు తమకు కలుగుతుందన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తనకు అనుకూలంగా ఉన్నవారికి అందలం ఎక్కించారన్నారు. పరిశ్రమల శాఖ నివేదిక ఇవ్వడం వల్లనే జాస్తి కిషోర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుందని అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబులో ఇటీవల ఫ్రస్టేషన్ పెరిగిందన్నారు. అందుకే బూతులు మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబు ఈ మధ్య కాలంలో బ్యాలన్స్ తప్పుతున్నారన్నారు.

Tags:    

Similar News