ఆపితే ఆగుతుందా?

తమను అడ్డుకునేది చంద్రబాబు కాదని, ప్రజలు అని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. తాము మూడు రాజధానుల ప్రక్రియను ఆపే ప్రసక్తి లేదని చెప్పారు. మూడు [more]

;

Update: 2020-01-23 08:55 GMT

తమను అడ్డుకునేది చంద్రబాబు కాదని, ప్రజలు అని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. తాము మూడు రాజధానుల ప్రక్రియను ఆపే ప్రసక్తి లేదని చెప్పారు. మూడు రాజధానుల అంశం తమకు ప్రజల నుంచి సానుకూలత వస్తుందని తాము ఆశించామన్నారు. ప్రజల్లో అది లేకుంటే ఐదేళ్ల తర్వాత ప్రజలే తీర్పు చెబుతారన్నారు. కానీ చంద్రబాబు ఒక్కడూ అప్రజాస్వామికంగా అడ్డుకోవడమేంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎన్నాళ్లు తమ నిర్ణయాన్ని ఆపగలరని నిలదీశారు. శాసనమండలిని ఉపయోగించుకుని రాజకీయాలు చేయడం తగదన్నారు. ఆందోళన చేస్తున్న వాళ్లు కూడా ఆలోచించుకోవాలని అంబటి రాంబాబు కోరారు. తమకు ఐదేళ్లు ప్రజలు పాలించమని అవకాశం కల్పించారని, అది తెలుసుకుని చంద్రబాబు వ్యవహరించాలని అంబటి రాంబాబు కోరారు.

Tags:    

Similar News