ఆయనను తొలగించినంత మాత్రాన కొంపలు మునిగిపోలేదు

వ్యవస్థలను బాగు చేయాలనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలో సవరణలు తీసుకొచ్చామని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఆరేళ్ల పదవీకాలాన్ని మూడేళ్లకు కుదించడం నేరమా? అని [more]

;

Update: 2020-04-10 14:11 GMT

వ్యవస్థలను బాగు చేయాలనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలో సవరణలు తీసుకొచ్చామని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఆరేళ్ల పదవీకాలాన్ని మూడేళ్లకు కుదించడం నేరమా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. బడ్జెట్ ను కూడా ఆర్డినెన్స్ రూపంలో ఆమోదించుకున్నామన్న విషయాన్ని అంబటి రాంబాబు గుర్తు చేశారు. హైకోర్టు రిటైైర్డ్ జడ్జిని నియమించడం తప్పు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ రాష్ట్ర ఎన్నికల అధికారిని నియమించినా ఆయన ఆమోదంతోనే ఆర్డినెన్స్ వచ్చిందన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించడంలో కొంపలు ఏమీ మునిగిపోలేదని, ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Tags:    

Similar News