నేటి నుంచి ఏపీలో ఇంటింటి సర్వే

ఆంధ్రప్రదేశ్‌లో జ్వర పీడితులను గుర్తించే కార్యక్రమాన్ని శ‌నివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ [more]

Update: 2021-05-15 01:26 GMT

ఆంధ్రప్రదేశ్‌లో జ్వర పీడితులను గుర్తించే కార్యక్రమాన్ని శ‌నివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. రాబోయే రెండు మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఆక్సిజన్ నిల్వలతో పాటు అదనంగా 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి రానుందని పేర్కొన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జీల సంఖ్య పెరుగుతోందని, ఇది శుభపరిణామమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు

Tags:    

Similar News