పోలవరంపై టీడీపీ డ్రామాలను బయటపెడతాం

కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టుకు అన్యాయం జరిగిందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. పోలవరం విషయంలో తప్పులు చేసిందెవరో ప్రజలకు తెలియజెప్తామన్నారు. [more]

Update: 2020-10-26 05:57 GMT

కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టుకు అన్యాయం జరిగిందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. పోలవరం విషయంలో తప్పులు చేసిందెవరో ప్రజలకు తెలియజెప్తామన్నారు. టీడీపీ నేతల బండారాన్ని బయటపెడతామని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తామే చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2014 తర్వాత పోలవరం ప్రాజెక్టులో జరిగే మార్పులకు, పెరిగిన అంచనా వ్యయానికి తాము బాధ్యత వహించబోమని కేంద్ర ప్రభుత్వం ఆనాడే చెప్పిందన్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అని, దానికయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరించాలని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.

Tags:    

Similar News