చేతకాని వారం కాము.. అంతకంటే ఎక్కువగా మాట్లాడగలం

తమకు కేటాయించిన మేరకే నీటిని వాడుకుంటామని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కేటాయింపులకు లోబడే తాము నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ 800 అడుగులకే [more]

Update: 2021-06-30 12:16 GMT

తమకు కేటాయించిన మేరకే నీటిని వాడుకుంటామని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కేటాయింపులకు లోబడే తాము నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ 800 అడుగులకే నీటిని డ్రా చేస్తుందని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. అయినా తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని, తమను చేతకాని వారం అనుకోవద్దని అనిల్ కుమార్ పరోక్షంగా హెచ్చరించారు. వారికంటే పరుషంగా మాట్లాడే మంత్రులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారని గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు. జల విద్యుత్తు ఉత్పత్తి కోసం తమను ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తెలంగాణలో పెద్దయెత్తున అక్రమ ప్రాజెక్టులు నిర్మిన్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్టులను సందర్శించే ముందు కేఆర్ఎంబీ అధికారులు ముందు తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను నిర్మించాలని ఆయన కోరారు.

Tags:    

Similar News