చంద్రబాబు వల్లనే ఈ పాపం

పులిచింతల ప్రాజెక్టుకు ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబు వైఖరే కారణమని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మంత్రివర్గ సమావేశంలో పులిచింతల ప్రాజెక్టు గేటు [more]

Update: 2021-08-06 14:03 GMT

పులిచింతల ప్రాజెక్టుకు ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబు వైఖరే కారణమని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మంత్రివర్గ సమావేశంలో పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిపోవడంపై చర్చ జరిగిందన్నారు. హైడ్రాలిక్ గేట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని జగన్ ఆదేశించారని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. చంద్రబాబు అప్పటి తన ఎమ్మెల్యేకు లబ్ది చేకూర్చేందుకే ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. పులిచింతల ప్రాజెక్టులో భద్రతపరమైన లోపాలున్నాయని 2015లో నిపుణుల కమిటీ ఎత్తి చూపినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కాంట్రాక్టరుకు ప్రయోజనం చేకూర్చేలా చంద్రబాబు వ్యవహరించారన్నారు.

Tags:    

Similar News