సుచరితకు ఝలక్ ఇచ్చిన ఏపీ సీఎం
సుచరిత రాజీనామా చేయడంతో అధిష్ఠానం ఆమెపై ఆగ్రహం ఉన్నట్లు తెలుస్తోంది. చెప్పా పెట్టకుండా.. కొత్త కేబినెట్ లిస్ట్ రాగానే ..
అమరావతి : ఏపీలో కొత్త కేబినెట్ విస్తరణ అనంతరం.. మంత్రిపదవులు ఆశించిన కొందరు ఎమ్మెల్యేలకు నిరాశ ఎదురవ్వడంతో ప్రభుత్వంపై అలకబూనారు. వారిలో బాలినేని శ్రీనివాస్, పిన్నెల్లి రామకృష్ణ, సామినేని ఉదయభాను, కోటంరెడ్డి శ్రీధర్, సుచరిత ఇలా పలువురు ఉన్నారు. దాంతో సీఎం జగన్ అసంతృప్త ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశమవుతున్నారు. నిన్న బాలినేనితో సమావేశమైన జగన్.. నేడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణతో భేటీ అయ్యారు. అందరూ అసంతృప్తిగా ఉన్నా.. మాజీ మంత్రి సుచరిత మాత్రం ఏకంగా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేశారు.
సుచరిత రాజీనామా చేయడంతో అధిష్ఠానం ఆమెపై ఆగ్రహం ఉన్నట్లు తెలుస్తోంది. చెప్పా పెట్టకుండా.. కొత్త కేబినెట్ లిస్ట్ రాగానే రాజీనామా చేయడంతో.. సీఎం జగన్ తీవ్రఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అందుకే సుచరిత సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా.. జగన్ మాత్రం ఆమెతో మాట్లాడేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. సీఎం జగన్ తన తోటిమంత్రులకు కేబినెట్ లో స్థానం ఇచ్చి తనకు మాత్రమే ఇవ్వకపోవడంపై సుచరిత అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదని కూడా సుచరిత ప్రశ్నిస్తున్నారు.