బ్రేకింగ్ : డీజీపీని అడ్డుకునే యత్నం

ఆంధప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్, మంత్రి అవంతి శ్రీనివాసరావులను వెంకటాపురం గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎల్జీ పరిశ్రమ యాజమానులను అరెస్ట్ చేయాలని కోరుతూ పెద్దయెత్తున స్థానికులు నిరసనకు దిగారు. [more]

Update: 2020-05-09 06:33 GMT

ఆంధప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్, మంత్రి అవంతి శ్రీనివాసరావులను వెంకటాపురం గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎల్జీ పరిశ్రమ యాజమానులను అరెస్ట్ చేయాలని కోరుతూ పెద్దయెత్తున స్థానికులు నిరసనకు దిగారు. దీంతో ఎల్జీ పరిశ్రమలోనే డీజీపీ గౌతం సవాంగ్ ఉండిపోయారు. దీంతో పోలీసులు ప్రత్యేక భద్రత నడుమ గౌతం సవాంగ్, మంత్రి అవంతిని బయటకు తీసుకువచ్చారు. గ్రామస్థులు భయపడాల్సిన పనిలేదని, కంపెనీ పరిసరాల్లో సాధారణ పరిస్థితులు వచ్చాయని, అవసరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు, మరో 24గంటల్లో పూర్తిగా పరిస్థితి అదుపులోకి వస్తుందని చెప్పారు. నిరసన కారులను పోలీసులు చెదరగొడుతున్నారు. మృతదేహాలతో ధర్నాకు దిగారు. కొందరు డీజీపీ కాళ్లపై పడి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని వేడుకున్నారు. కమిటీ నివేదిక వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags:    

Similar News