బ్రేకింగ్ : ఈ నెల నుంచే నగదు బదిలీ పధకం

ఉచిత విద్యుత్ లో నగదు బదిలీ పథకాన్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ నెల నుంచి [more]

Update: 2020-09-07 14:58 GMT

ఉచిత విద్యుత్ లో నగదు బదిలీ పథకాన్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ నెల నుంచి రైతుల ఖాతాల్లో నగదు బదిలీని చేయనున్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి, రైతులు వాడుకున్న విద్యుత్తును నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులు వ్యవసాయానికి ఎంత విద్యుత్ వాడుకున్నా నగదును చెల్లిస్తారు. ఇందుకోసం రైతులకు ప్రత్యేక బ్యాంకు అకౌంట్లను కూడా ప్రారంభించే అందులో నగదును బదిలీ చేస్తారు. విపక్షాలు అభ్యంతరం చెబుతున్నా విద్యుత్ నగదు బదిలీ పథకాన్ని ఈ నెల నుంచే ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

Tags:    

Similar News