బాబూ చీప్ గా బిహేవ్ చేయకు

రివర్స్ టెండరింగ్ అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని, తాము రివర్స్ టెండరింగ్ ను పారదర్శకంగా నిర్వహించామన్నారు మంత్రి అనిల్ కుమార్. రివర్స్ టెండరింగ్ ద్వారా [more]

Update: 2019-09-21 06:20 GMT

రివర్స్ టెండరింగ్ అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని, తాము రివర్స్ టెండరింగ్ ను పారదర్శకంగా నిర్వహించామన్నారు మంత్రి అనిల్ కుమార్. రివర్స్ టెండరింగ్ ద్వారా ఏపీకి 58కోట్లు ఆదా అవుతోందని చెప్పారు. తాము ఎవరికి కాంట్రాక్టులు కట్టబెట్టాల్సిన అవసరం మాకు లేదని, సొంత మనుషులకు చంద్రబాబే టెండర్లు కట్టబెట్టుకున్నారని అనిల్ ఆరోపించారు. టీడీపీ హయాంలో ఎక్కువ ధరలకు కోడ్ చేసిన సంస్థే ఇప్పుడు తక్కువ ధరకు టెండర్ వేసిందని దీన్ని బట్టి టీడీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందో అర్థమువుతుందిగా నంటూ ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో టెండర్ల పేరుతో కోట్లాది రూపాలయను అనుచరులకు కట్టబెట్టారని మంత్రి అనిల్ ధ్వజమెత్తారు.

 

Tags:    

Similar News