ప్రారంభమైన మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం
వెలగపూడిలోని అసెంబ్లీ పక్కన ఉన్న భారీ ఖాళీ స్థలంలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. మొదటిగా అంబటి రాంబాబు..
వెలగపూడి : ఏపీలో కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం మొదలైంది. పాత, కొత్త మంత్రులతో కలిపి మొత్తం 25 మంది చేత ఈరోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. వెలగపూడిలోని అసెంబ్లీ పక్కన ఉన్న భారీ ఖాళీ స్థలంలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. మొదటిగా అంబటి రాంబాబు ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంబటి రాంబాబు 1989లో తొలిసారి రేపల్లె నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2005-07 వరకూ ఏపీఐఐసీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కేబినెట్ లో తనకు మంత్రిపదవి ఇవ్వడంపై అంబటి రాంబాబు హర్షం వ్యక్తం చేశారు. మంత్రిగా సీఎం జగన్ తనపై ఉంచిన బాధ్యతను నెరవేరుస్తానని ప్రమాణం చేశారు.