SLBC Accident : లోపం ఎక్కడ? మానవ వైఫల్యం కాకున్నా...ఆటంకాలే అడ్డంకి

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో ప్రమాదం జిరగి నేటికి నలభై ఏడో రోజుకు చేరుకుంది;

Update: 2025-04-12 03:54 GMT
accident, forty-seventh day, left canal tunnel,  srisailam
  • whatsapp icon

ప్రమాదం జరిగి నెలన్నర రోజులు దాటుతున్నా మృతదేహాలు వెలికి తీయలేకపోవడమేమిటి? ఎక్కడ ఉన్నది లోపం? మానవ ప్రయత్నమంతా చేస్తున్నారు. రోజుకు కోట్లాది రూపాయలు సహాయక చర్యల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. కానీ ఆశించినంత మేరకు మాత్రం ఫలితం కనిపించడం లేదు. మృతదేహాలు దొరికే వరకూ అన్వేషణ కొనసాగించాల్సిందేనన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సహాయక బృందాలు నిరంతరం తమ పనులను కొనసాగిస్తూనే ఉన్నాయి. అయినా ఇంత వరకూ ముగింపుదశకు చేరుకోవడం లేదు.

నేటికి నలభై ఏడో రోజు...
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో ప్రమాదం జిరగి నేటికి నలభై ఏడో రోజుకు చేరుకుంది. కన్వేయర్ బెల్ట్ ను ఏర్పాటు చేయడానికే నెలకు పైగా సమయం పట్టింది. టీబీఎం మిషన్ శకలాలు సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి. అలాగే తొమ్మిది అడుగుల మేరకు పేరుకుపోయిన బురద కూడా అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. దీంతో మృతదేహాల వెలికి తీత కష్టసాధ్యమయింది. దేశంలో పేరెన్నిక కలిగిన సంస్థలు ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించడం లేదు. అంటే మానవ వైఫల్యం లేకపోయినా అడుగడుగునా ఆటంకాలే మృతదేహాల జాడ కనుక్కోలేకపోతున్నారని అధికారులు చెబుతున్నారు.
వేగంగా అడుగులు...
ఆరు మృతదేహాల కోసం నిరంతరం గాలిస్తున్నా అవి ఉన్న చోటకు సహాయక బృందాలు వెళ్లలేకపోతున్నాయి. అయితే గత రెండు రోజుల నుంచి వేగంగా అడుగులు పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలు ఊపందుకుంటున్నాయని చెప్పారు. మృతదేహాలు ఉన్న చోటను కేరళ శునకాలు గుర్తించిన ప్రాంతం ప్రమాదకరమైనది కావడంతో అక్కడ వరకూ వెళ్లడానికే మొన్నటి వరకూ జంకిన సహాయక బృందాలు ఇప్పుడిప్పుడే అటు వైపు అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. అంతా సవ్యంగా జరిగితే వారం రోజుల్లోనే ఆపరేషన్ కు ఎండ్ కార్డు పడుతుందని చెబుతున్నారు.




Tags:    

Similar News