రాయలసీమ ప్రజలను అవమానించేలా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీరరాఘవ సినిమాను నిషేధించాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సినిమాలోని పలు సన్నివేశాలు రాయలసీమ ప్రజలను కించపరిచేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాయలసీమ సమస్యలపై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రాయలసీమలో హైకోర్టు పెట్టేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు.