Breaking : జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. అమరావతి భూములు?

రాజధాని అమరావతి లో అసైన్డ్ రైతులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించింది. గత తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని [more]

Update: 2021-09-13 07:39 GMT

రాజధాని అమరావతి లో అసైన్డ్ రైతులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించింది. గత తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని అమరావతి పరిధిలో దళితులకు అసైర్డ్ భూములు ఇచ్చింది. ఈ అసైన్డ్ భూములను వెనక్కు తిరిగి ఇవ్వాలని ప్రస్తుత జగన్ ప్రభుత్వం 316 జీవో ను తెచ్చింది. అసైన్డ్ భూములను కూడా కొందరు కొనుగోలు చేశారన్న ఆరోపణలు రావడం, అసెన్డ్ భూముల విక్రయాలు జరిగాయని ప్రభుత్వం భావించింది. దీంతో ఆ భూములను వెనక్కు ఇచ్చేయాలని ప్రభుత్వం జీవో నెంబరు 316ను జారీ చేసింది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు జీవో నెంబరు 316పై పై స్టేటస్ కో విధించింది. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది.

Tags:    

Similar News