జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ ఎవరంటే....?

Update: 2018-10-25 08:15 GMT

వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం సంచలనం కల్గిస్తోంది. ఎయిర్ పోర్ట్ లోనే రక్షణ కొరవడింది. వైఎస్ జగన్ గత పదకొండు నెలల నుంచి ప్రజాక్షేత్రంలో్నే ఉన్నారు. ఆయన గత ఏడాది నవంబరు నుంచి ప్రజాసంకల్ప పాదయాత్రను నిర్వహిస్తున్నారు. నిత్యం ఉదయం నుంచే జగన్ ను కలిసేందుకు వందల సంఖ్యలో ఆయన అభిమానులు,ప్రజలు వస్తుంటారు. అందరితో జగన్ ఓపిగ్గా సెల్ఫీలు దిగుతుంటారు. అయితే భద్రతపరంగా జగన్ కు ముప్పు ఉందని అందరికీ తెలిసిందే. అయితే గత కొద్దిరోజుల నుంచి వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు భద్రత పెంచాలని అనేకసార్లు పోలీసు ఉన్నతాధికారులను, ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు.

కత్తికి రసాయనాలు పూశాడా?

కానీ జగన్ కు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమయిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి సెల్పీ దిగుతానని జగన్ వద్దకు వచ్చారు. కోడిపందేలకు ఉపయోగించే కత్తితో శ్రీనివాస్ ఈ దాడికి పాల్పడ్డారు. అయితే ఈ కత్తికి ఏవైనా రసాయనాలు పూశారా? అన్న అనుమానాలు వైసీపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే జగన్ ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని విశాఖ నుంచి హైదరాబాద్ ఫ్లయిట్ లో బయలుదేరారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆసుపత్రికి వెంటనే తీసుకెళ్లాలని వైసీపీ నేతలు ఇక్కడ అంతా సిద్ధం చేశారు. జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతనే అసలు విషయం బయటకు వస్తుంది.

టీడీపీ టిక్కెట్ కోసం యత్నించిన.....

దాడి వెనక కారణాలేంటనేది ఎవరికీ అర్థం కావడం లేదు. కేవలం వెయిటర్ గా పనిచేస్తున్న వ్యక్తి జగన్ పై దాడికి పాల్పడే అవకాశం ఉండదు. ఏదో కక్షతోనే జగన్ పై హత్యాయత్నం జరిగిందంటున్నారు. మెడపై దాడి చేయాలనుకున్న శ్రీనివాస్ ప్రయత్నాన్ని జగన్ గన్ మెన్లు వమ్ము చేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది. దాడి చేసిన శ్రీనివాస్ ఎయిర్ పోర్ట్ లాంజ్ రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్. హర్షవర్ధన్ గతంలో గాజువాక టీడీపీ టిక్కెట్ ఆశించారని తెలుస్తోంది. మరి ఈ దాడి శ్రీనివాస్ ఎందుకు చేశాడన్నది పోలీసు విచారణలో తెలియనుంది?

Similar News