అయోధ్య కేసులో సుప్రీం తీర్పు చెప్పింది. విచారణను విస్తృత ధర్మాసనానికి ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విచారణను ఐదుగురు సభ్యులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయమని త్రిసభ్య బెంచ్ పేర్కొంది. అనన్నీ ప్రార్థన స్థలాలకు, మతాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అక్టోబరు చివరి వారంలో ఈకేసును విచారించనున్నట్లు వెల్లడించింది. 1994 నాటి కేసు కేవలం భూసేకరణకు సంబంధించిందని అభిప్రాయపడింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ భూషణ్ వాదనలతో మరో న్యాయమూర్తి నజీర్ ఏకీభవించలేదు. అక్టోబరు చివరి వారంలో అయోధ్య పై విచారణ చేపట్టాలని నిర్ణయించింది.