ఇంగ్లాండ్ టూర్ లో ఎదురైన చేదు అనుభవాలనుంచి తేరుకుంది బిసిసిఐ. పేరుగొప్ప ఆట సున్నా గా పేరొందిన ప్లేయర్ లు విదేశీ గడ్డపై చతికిల పడుతుండటంతో యువ క్రికెటర్లను తయారు చేసేందుకు సాహసమైన నిర్ణయాలు తీసుకుంది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 4 వరకు యూఏఈ లో జరగనున్న ఆసియా కప్ కి పాత కొత్త మేళవింపుతో టీం ఇండియా నయా టీం ను ప్రకటించింది బిసిసిఐ. అలుపెరగని రీతిలో విజృంభిస్తున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ కి విశ్రాంతి ప్రకటించింది. స్వదేశీ క్రికెట్లో రాణిస్తున్న యువతరానికి మంచి అవకాశమే లభించింది.
ఆసియా కప్ టీం ఇదే ....
ఆసియా కప్ కి కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమించారు. వైస్ కెప్టెన్ గా శిఖర్ ధావన్ వ్యవహరించనున్నాడు. ఇక టీం లో ఫిట్ నెస్ నిరూపించుకోవడంతో అంబటి రాయుడు ను సెలెక్టర్ లు ఎంపిక చేశారు. టీం ఇండియా లో ఎంపికైన మిగిలిన వారిలో కె ఎల్ రాహుల్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, ఎం ఎస్ ధోని, దినేష్ కార్తీక్, భువనేశ్వర కుమార్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అక్షర పటేల్, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, హార్దిక్ పాండ్య, జన్ ప్రీత్ బుమ్రా వున్నారు. ఆసియా కప్ అనంతరం టీం ఇండియా వెస్ట్ ఇండీస్ తో తలపడనుంది. ఇంగ్లాండ్ టూర్ నుంచి తిరిగి రాగానే విరామం లేని క్రికెట్ ను భారత ఆటగాళ్లు ఎదుర్కోనున్నారు. సీనియర్లు పేలవంగా ఒక్కోసారి ఆడటంతో ఇప్పటినుంచి యువ ఆటగాళ్లను కూడా ప్రోత్సహించాలని బిసిసిఐ కొత్త ప్రయోగాలకు సిద్ధమైంది.