ఫిష్ బిర్యానీ కావాలా? థమ్ బిర్యానీ నా? ...మటన్ మసాలా విత్ కోక్ కావాలా..? ఆర్డర్ వేస్తే చాలు క్షణాల్లో వేడి వేడిగా మీ పసందైన ఫుడ్ మీ ముందుంటుంది.. ఏంటీ వినగానే నోట్లో నీరూరుతోందా..ఇదేదో స్విగ్గిీ..ఫుడ్ కోర్ట్ యాప్ ఫుడ్ ఆర్డర్ కాదు.. ఎక్సైజ్ పోలీసులు బయటపెట్టిన.. ఘాటైన ఫులావ్.. ఇంతకీ ఆ ఆర్డర్స్ ఏంటీ.. దాని మతలబేంటో తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ స్టోరీ చూడండీ..ఆ ఫుడ్ ప్యాంకింగ్ లోపల ఉన్న కహానీ తెలుసుకోండి.
ఆన్ లైన్ లో .......
ఒక చేప. రెండు బిర్యానీలు. చిరునామా పిల్లర్ నెంబర్ 202.’ ఇదేదో ఆన్‌లైన్ ఆహార సరఫరా సంస్థకు ఖాతాదారుడు ఇచ్చిన జాబితాగా కనిపిస్తుంది కదూ..ఈ మధ్య ఆన్ లైన్ ఫుడ్ బిజినెస్ బాగా జరుగుతుండటం అందరూ ఇంటికే ఆర్దర్ ఇచ్చి తెప్పించు కోవడం సిటీలో రోటీనైపోయింది. సదరు కంపెనీలు ఇచ్చే ఆఫర్లతో ..ఇప్పుడు ఎక్కువగా చాలా మంది ఇలా ఆన్లైన్ లో ఆర్దర్ చేసి తెప్పించుకొంటున్నారు. ఏ హోటల్ కావాలని మనం ఎంపిక చేస్తే చాలు..ఆ ఆర్డర్ అరగంటలో మన ముందుంటుంది.
ఈ క్రేజ్ నే డ్రగ్స్....
ఈ క్రేజ్ నే డ్రగ్స్ మాఫియా తమ దందాగా మార్చుకున్నాయి. ఫుడ్ ఆర్డర్ రూపంలో జోరుగా వ్యాపారాలు సాగిస్తున్నాయి. ఇటీవల పట్టుబడిన డ్రగ్స్ సరఫరా నిందితులను విచారిస్తే దిమ్మతిరిగే ఈ విషయాలు బయటపడ్డాయి. కొకైన్, గంజాయి, బ్రౌన్ షుగర్..వైన్ చాక్లెట్స్ ఇలా ఏదైనా సరే ఫుడ్ రూపంలో ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ని బట్టి రేటు.. ఆ మత్తుపదార్థం వారికి దక్కుతుంది. ఇలా డెలవరీ చేస్తే ఎవరికీ అనుమానం రాదు.. పోలీసులకు పట్టుబడటం సాధ్యం కాదు. అందుకే డ్రగ్స్ మాఫియా ఈ రూట్ ని ఎంచుకుంది.
ఫిష్ బిర్యానీ అంటే.....
ఫిష్ బిర్యానీ అంటే కొకైన్..బ్రౌన్ షుగర్ కి థమ్ బిర్యానీ.. గంజాయి కావాలంటే పిజ్జా.. వైన్ చాక్లెట్స్ కావాలాంటే కోక్.. ఇలా కస్టమర్ ఆర్డర్ వేస్తే చాలు.. ఆర్డర్ వేసిన వాటిని బట్టి డ్రగ్స్ సరఫరా జరుగుతుంది. గ్రాము వెయ్యి రూపాయల నుండి అయిదు వేలు.. పది వేల రూపాయల వరకు ధర పలుకుంది. ఇలా నిత్యం సిటీలో అనేక మంది ప్రముఖుల పుత్రరత్నాలు ఆర్డర్ వేసే ఫుడ్ కహానీని.. ఇప్పడు ఎక్సైజ్ పోలీసులు దీన్నే బట్టబయలు చేశారు.. ఫుడ్ ఆర్డర్ వెనుక ఉన్న మర్మం తెలుసుకొని దాని రంగు రుచి..వాసన పసిగట్టే పనిలో పడ్డారు.
అబ్దుల్లా పట్టుబడటంతో....
ఇటీవల పోలీసులకు పట్టుబడిన అబ్దుల్లా అనే వ్యక్తి ఫోన్ లో ఈ డ్రగ్స్ ఫుడ్ సరఫరా బయటపడింది. దాని కస్టమర్లు ఎవరూ.. ఎంత కాలం నుండి నడుస్తోంది అని ప్రశ్నిస్తే ఆరునెలలుగా ఇదే దందా సాగుతున్నట్లు తెలిసింది. అబ్దుల్లా ఫోన్ లిస్టులో ఉన్న ఆహార ప్రియులు అదే డ్రగ్స్ బానిసల లిస్టు సేకరించే పనిలో పడ్డారు ఇప్పుడు ఎక్సైజ్ పోలీసులు. గోవా నుంచి మత్తుపదార్థాలు తీసుకొచ్చి నగరంలో సరఫరా చేస్తున్న అబ్దుల్లాను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసినప్పుడు అతడి వద్ద నుండి 31 గ్రాముల కొకైన్, 7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇతని ఫోన్ లో ఉన్న మెసేజ్ లను విశ్లేషించినప్పుడు అనేక వాస్తవాలు బయట పడ్డాయి . దాదాపు 40 వేరు వేరు నెంబర్ల నుంచి వేర్వేరు మత్తు పదార్ఘాలు కావాలంటూ కొనుగోలుదారులు అబ్దుల్లాను కోరారు.. డ్రగ్స్ సప్లయ్ కి నిక్ నేమ్స్ పెట్టి తెప్పించుకుంటున్నట్లు తేలింది.
రెండు వందలకు మందికి పైగానే.....
దాదాపు 200 మందికి పైగా ఈ తరహా ఆర్డర్స్ వేసి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. అందులో 50 మంది బడా వ్యాపారుల పిల్లలే ఉన్నారని తేలింది. ఉదయం ఏడున్నర గంట నుండి పది గంటల సమయంలోనే ఈ కోడ్ బాషతో డ్రగ్స్ బుకింగ్ స్టార్ అవుతుంది. ఆ తరువాత సాయంత్రం కొనుగోలు చేసిన మత్తుపదార్థాలు వాడకం జరుగుతోందని తెలిసింది. దీనిపై అప్రమత్తమైన ఎక్సైజ్ అదికారులు 200 మంది పేర్లు ఫోన్ నెంబర్లు సంపాదించారు. వారి చిరునామా కోసం వేట మొదలు పెట్టారు. ఎక్కువగా కొండాపూర్, చందానగర్, రాయదుర్గం, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ప్రశాసన్ నగర్ ప్రాంతాల నుండి ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. అబ్దుల్లా తో పాటు ఇటీవల పట్టుబడ్డ అమెజాన్ ఉద్యోగి ప్రణబ్.. అంతర్జాతీయ మార్కెట్ బ్లాగ్ వెబ్ సైట్ నుండి డ్రగ్స్ కొనుగోలు చేసి వాటిని ఇదే తరహా ఫుడ్ ఆర్డర్ రూపంలో అమ్మకాలు జరిపినట్లు తేలింది. డ్రగ్స్ కి హైదరాబాద్ లో మంచి గిరాకీ ఉండటంతో ఆశ అత్యాశగా మారి ఏకంగా ఇంట్లోనే గంజాయి మొక్కల పెంపకం మొదలు పెట్టాడు. పట్టబడిన ఈ ఇద్దరే కాదు ఇదే తరహాలో చాలా మంది వ్యాపారం చేస్తున్నట్లు తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు. ఎలాగైనా వీటి మూలాలు బయటపెట్టాలని అధికారులు సీరియస్ గా పని చేస్తున్నారు.