బ్రేకింగ్ : బండి సంజయ్ కు బెయిల్ రద్దు.. 14 రోజులు రిమాండ్ !
బండి సంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను కరీంనగర్ కోర్టు కొట్టివేసింది. 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆయనతో పాటు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ కేసులు దాఖలైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను కరీంనగర్ కోర్టు కొట్టివేసింది. 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో బండి సంజయ్ ను పోలీసులు కోర్టు నుంచి కరీంనగర్ జైలుకు తరలించారు. ఆయనతో పాటు కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కాచరవి, మర్రి సతీష్ లకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
Also Read : ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం - డీజీపీకి చంద్రబాబు లేఖ
317 జీవోను రద్దు చేయాలని కోరుతూ బండి సంజయ్ జనవరి 2, ఆదివారం రాత్రి కరీంనగర్ లోని తన కార్యాలయంలో దీక్ష చేపట్టారు. కోవిడ్ నిబంధనలు అమలవుతున్న కారణంగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. నోటీసు జారీ చేసినా వినకుండా దీక్ష చేపట్టడంతో.. నిన్న రాత్రి 9 గంటలు దాటిన తర్వాత దాదాపు మూడు గంటల హై డ్రామా మధ్య బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం బండి సంజయ్ ను కరీంనగర్ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్ధానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి మరో 11 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లోతెలిపారు.