నల్ల చిరుత కాదు అది.. గండుపిల్లి… హైదరాబాద్ లో?

హైదరాబాదులోని గోల్కొండలో నల్ల చిరుత అంటూ కలకలం సృష్టించింది. గోల్కొండలోని ఫతే దర్వాజా ప్రాంతంలో ఈ నల్ల చిరుత కనిపించింది అంటూ ప్రచారం జరిగింది. ఉదయం సమయంలో [more]

Update: 2020-05-14 04:18 GMT

హైదరాబాదులోని గోల్కొండలో నల్ల చిరుత అంటూ కలకలం సృష్టించింది. గోల్కొండలోని ఫతే దర్వాజా ప్రాంతంలో ఈ నల్ల చిరుత కనిపించింది అంటూ ప్రచారం జరిగింది. ఉదయం సమయంలో మసీదులో కనిపించింది అంటూ స్థానికులు ఆందోళనకు గురయ్యారు. మసీదు లోకి నల్ల చిరుత చొరబడిందని స్థానికులు తెలిపారు. దీంతో ఒక్కసారికి ఆందోళనకరమైన స్థానికులు ఇళ్ల నుంచి ఎవరు కూడా బయటికి రాలేదు. ఇంతలో పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. మసీదు వైపు వెళ్లే అన్ని రాకపోకలు మూసివేశారు. దీంతోపాటుగా మసీదుని పూర్తిగా క్లోజ్ చేశారు. మసీదు లో ఉన్న నల్ల చిరుతను పట్టుకోవడానికి రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. దాదాపు గంట పాటు శ్రమించి తర్వాత దానిని పట్టుకున్నారు . అయితే ఇది నల్ల చిరుత కాదని అధికారులు తేల్చారు. నల్ల చిరుత మాదిరిగానే ఉంటుందని ,కానీ సివెట్ క్యాట్ అని అధికారులు చెప్పారు. పట్టుకున్న సివెట్ క్యాట్ ని అధికారులు జూ కు తరలించారు.

Tags:    

Similar News