బిగ్ బ్రేకింగ్ : టీడీపీ ఎఫెక్ట్ ... ఏపీ .కాంగ్రెస్ కు మరో కీలకనేత బై....బై...!!!

Update: 2018-11-03 05:25 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలసి వచ్చిన వెంటనే ఏపీ కాంగ్రెస్ లో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. టీడీపీతో పొత్తు ఇష్టం లేని కాంగ్రెస్ నేతలు వరుసబెట్టి పార్టీని వీడుతున్నారు. నిన్న మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ పార్టీకి రాజీనామా చేయగా, నేడు మరో కీలక నేతపార్టీ కి బైబై చెప్పనున్నారు. కడప జిల్లాకు చెందిన సి.రామచంద్రయ్య మరికొద్దిసేపట్లో పార్టీకి రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్ తో చంద్రబాబు చేతులు కలపడం వల్లనే సి.ఆర్ పార్టీ నుంచి బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News