నేడు రైతు సంఘాలతో తొమ్మిదో విడత చర్చలు

రైతు సంఘాల ప్రతినిధులతో నేడు కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనుంది. తొమ్మిదో విడత చర్చలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు [more]

Update: 2021-01-15 02:38 GMT

రైతు సంఘాల ప్రతినిధులతో నేడు కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనుంది. తొమ్మిదో విడత చర్చలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు కూడా ఇటీవల కమిటీని నియమించింది. తొమ్మిదో విడత చర్చలు మధ్యాహ్నం 12 గంటలకు విజ్ఞాన్ భవన్ లో జరగనున్నాయి. మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం మాత్రం చట్టాల రద్దుకు మొగ్గు చూపడం లేదు.

Tags:    

Similar News