పోలవరం ప్రాజెక్టులో నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం అక్రమ చెల్లింపులు చేసిందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన లిఖితపూర్వక వివరణలో పలు కీలకాంశాలు బయటకు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, ఉక్కు కొనుగోలుకు సంబంధించి బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయని కేంద్రం స్పష్టం చేసింది. అడ్వాన్స్ ల రూపంలో కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ డబ్బులు చెల్లించిందని కేంద్రం తేల్చింది. ఈ చెల్లింపులను కాగ్ కూడా ధృవీకరించిందని, ఇప్పటికే ఈ డబ్బు రికవరీకి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.