పేదలకు గృహ నిర్మాణ పథకంలో భాగంగా తెలంగాణకు ఇచ్చిన నిధులను వెనక్కు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. 2016-17 సంవత్సరానికి గానూ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం రూ.190 కోట్లు విడుదల చేసింది. అయితే, రాష్ట్ర ప్రభత్వం ఈ నిధులతో ఒక్క ఇళ్లు కూడా నిర్మించలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లకు కేంద్ర నిధులను రాష్ట్రం ఉపయోగించుకోలేదు. దీంతో నిధులను వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.