రేపటి నుంచి ఏపీలో టీడీపీ వారం పాటు నిరసనలు

ఈనెల 16వ తేదీ నుంచి వైసీపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలుగుదేశం పార్టీ నేతలు నిరసనలు తెలియజేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు నిచ్చారు. కరోనాతో [more]

;

Update: 2021-06-15 04:17 GMT

ఈనెల 16వ తేదీ నుంచి వైసీపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలుగుదేశం పార్టీ నేతలు నిరసనలు తెలియజేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు నిచ్చారు. కరోనాతో చనిపోయిన వారికి పది లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, లాక్ డౌన్ కారణంగా ఆదాయం కోల్పోయిన వారికి పదివేలు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మొత్తం పది డిమాండ్లతో ఈ నెల 16వ తేదీ నుంచి వారం రోజుల పాటు అంటే 22 వతేదీ వరకూ నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు కోరారు.

Tags:    

Similar News