జగన్ నీ నాటకాలు ఇక ఆపు....!!

Update: 2018-10-25 15:58 GMT

జగన్ పై దాడి ఒక నాటకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివర్ణించారు. సంఘటన జరిగినప్పుడు జగన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి హైదరాబాద్ కు ఎందుకు వెళ్లిపోయారని చంద్రబాబు ప్రశ్నించారు. గవర్నర్ సంఘటన జరిగిన వెంటనే గవర్నర్ నరసింహన్ డీజీపీకి ఎందుకు ఫోన్ చేశారు. పవన్ కల్యాణ్, కేటీఆర్, కేసీఆర్ ఈ దాడులను ఖండించడం అంతా ఒక డ్రామాగా నడిచిందన్నారు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం పూర్తిగా పతనమయిపోయిందన్నారు. ఈడీ, ఐటీ దాడులను ఇష్టారాజ్యంగా రాష్ట్రంలో జరుపుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నడుస్తున్న సెక్యూరిటీ ఎవరు బాధ్యత వహిస్తారు? దాడి చేసిన వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులమని శ్రీనివాస్ కుటుంబం చెబుతుందన్నారు. జగన్ కు సానుభూతి రావడం కోసమే తాను దాడి చేశానని శ్రీనివాస్ స్టేట్ మెంట్ ఇచ్చారన్నారు. సినీనటుడు శివాజీ చెప్పినట్లుగా ఆపరేషన్ గరుడ ఏపీలో ప్రారంభమయిందన్నారు.

పులివెందుల్లో ఫ్లెక్సీలు తగలబెడతారా?

పులివెందుల్లో ఫ్లెక్సీలు తగలబెడతారా? అని ఆయన ప్రశ్నించారు. తిత్లీ తుఫాను లో బాధితులను పరామర్శించడానికి తాను వెళితే తనపైనే వైసీపీ నేతలను ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. విశాఖపట్నం లో ఫిన్ టెక్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఈ సంఘటన జరిగిందన్నారు. వైసీపీ వ్యక్తే దాడులకు పాల్పడినప్పుడు సిగ్గుపడాలన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒక్కరు మాట్లాడరు కాని, ఏమీ జరగని నాటకానికి చిలువలు పలువలు చేస్తూ మాట్లాడుతున్నారన్నారు. ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన జగన్ సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు చెప్పాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లి అక్కడి నుంచి జగన్ ఇంటికి వెళ్లి మళ్లీ ప్రయివేటు ఆసుపత్రికి ఎందుకు వెళ్లారన్నారు.

మీ డ్రామాలు ఇక్కడ చెల్లవు......

మీ డ్రామాలు ఇక్కడ జరగనివ్వనని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇలా చేస్తూ పోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. ఈ సంఘటనను అడ్డం పెట్టుకుని కోర్టుకు వెళ్లి హాజరునుంచి తప్పించుకోవడానికే ఈ నాటకాన్ని సృష్టించారన్నారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి రాష్ట్ర పతి పాలన విధించాలని కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. తిత్లీ మీద ఒక మాట మాట్లాడని కేసీఆర్, కేటీఆర్, కవిత జగన్ పట్ల ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారన్నారు. జగన పై దాడి చేసిన వ్యక్తి ఇంట్లో వైసీపీ నేతల ఫొటోలే ఉన్నాయన్నారు. దాడి చేసిన కత్తిని కూడా వైసీపీ నేతలే చాలా సేపట వరకూ తమ దగ్గరే ఎందుకు ఉంచుకున్నారని ప్రశ్నించారు. 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్న తనకు ఇలాంటి దుర్మార్గపు నాటకాలు ఎన్నడూ చూడలేదన్నారు. మీరు చేసే ప్రతి దాడీ ఏపీ ప్రజలపైన దాడిగా చంద్రబాబు తెలిపారు. ఇలాంటి నాయకుల పట్ల ఏవిధంగా ఉండాలో ప్రజలకు తెలియజెప్పాలన్నారు. ఈ కేసులో చట్టం తన పనితాను చేసుకుపోతుందన్నారు. చౌకబారు రాజకీయాలు చేయవద్దని జగన్ ను చంద్రబాబు హెచ్చరించారు.

Similar News