వైసీపీ ప్రభుత్వంపై మండి పడ్డ చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. విశాఖలో మానసిక వికలాంగుల పాఠశాలను కూల్చివేయడం హేయమన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా [more]

;

Update: 2021-06-09 05:53 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. విశాఖలో మానసిక వికలాంగుల పాఠశాలను కూల్చివేయడం హేయమన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పాఠశాలను కూల్చివేయడం ఏంటని ప్రశ్నిచంారు. 190 మంది విద్యార్థులతో నడుస్తున్న ఈ పాఠశాలను కూల్చి వేసి ప్రభుత్వం తన పైశాచికత్వాన్ని చాటుకుందన్నారు. చట్టం, న్యాయం అనే నిబంధనలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు చంద్రబాబు. అక్కడి స్థలం కోసం మాఫియా ఈ కూల్చివేతలను చేపట్టిందన్నారు. అధికారులు కూడా దీనికి సహకరించారన్నారు. దివ్యాంగుల పాఠశాలను కూల్చి వేసి ప్రభుత్వం అధికారంలో ఉండే నైతిక హక్కును కోల్పోయిందన్నారు.

Tags:    

Similar News