ఆ పొత్తు లేకుంటే అధికారం దక్కకపోయినా గౌరవప్రద స్థానాలైనా దక్కేవి. ఆయన పొత్తుతో అటు పార్టీ ఇటు తాము తీవ్రంగా నష్టపోయామని లబోదిబోమంటున్నారు టి కాంగ్రెస్ నేతలు. ధైర్యం చేసి అధిష్టానానికి కొందరు తెలుగుదేశం తో పొత్తుతో చిత్తయిపోయే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించినా హస్తిన పెద్దలు ససేమిరా అన్నారు. దాంతో వచ్చిన ఫలితాలతో అయినా కళ్ళు తెరుస్తారని భావించి మళ్ళొక్కసారి అదే విషయం అధిష్టానానికి నివేదిస్తున్నారు టి కాంగ్రెస్ నేతలు. అయితే ఈసారి టిడిపి, కాంగ్రెస్ పొత్తును వ్యతిరేకించే వారు పెరిగారు సుమీ.
పార్లమెంట్ ఎన్నికలకు డౌట్ ...?
రాములమ్మ విజయశాంతి మనకు వలదు ఈ పొత్తు అని ముందే చెప్పారు. అయినా రాహుల్ వినలేదని కార్యకర్తల ముందు ఎన్నికల తరువాత వాపోయారు. చంద్రబాబు అతి ప్రచారం కొంప ముంచిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం వ్యాఖ్యానించారు. ఇక చాలామంది ఇదే బాటలో అధిష్టానం కు ఫిర్యాదు చేయడంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టిడిపి తో పొత్తు తెలంగాణ లో లేకుండానే బరిలోకి దిగాలా లేక కలుపుకుని వెళ్లాలా లేదా అన్న చర్చ 10 జన్ పద్ సీరియస్ గా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
బాబును విడిచిపెట్టాలా...?
మరోపక్క బిజెపి వ్యతిరేక కూటమికి జాతీయస్థాయిలో తన శక్తి యుక్తులను ధారపోస్తున్న చంద్రబాబు ను విడిచిపెట్టడం కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఇబ్బందిగా మారడంతో ఈ వ్యవహారంపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు రాహుల్ బృందం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరి హస్తం సైకిల్ దిగిపోతుందా ? లేక తమ ప్రయాణం కొనసాగిస్తుందో లేదో చూడాలి.