సక్సెస్ అయింది.. పెట్టుబడుల వెల్లువెత్తింది

విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స సమ్మిట్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. సమ్మిట్ చివరి రోజు జగన్ ప్రసంగించారు

Update: 2023-03-04 07:09 GMT

విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స సమ్మిట్ పూర్తిగా సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. సమ్మిట్ చివరి రోజైన రెండోరోజు జగన్ ప్రసంగించారు. సదస్సును విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. పెట్టుబడులు పెట్టిన వారిని ఆయన స్వాగతించారు. పెట్టుబడులు రాష్ట్రంలో పరిఢవిల్లుతాయని జగన్ హామీ ఇచ్చారు. అనుకూలమైన వాతావరణానికి ఇది దోహదపడుతుందని జగన్ అన్నారు. ఈ సదస్సు ఎంతో విలువైనదని తెలిపారు. తన పరిపాలనలో ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుందని ఆయన తెలిపారు.

ఆర్థికవ్యవస్థను...
తమ ప్రభుత్వ విధానాలు ఆర్థిక వ్యవస్థను కాపాడాయని జగన్ తెలిపారు. అనేక రంగాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. పదహేను రంగాలను ప్రాధాన్యత అంశాలుగా తీసుకున్నామని చెప్పారు. సదస్సు విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సదస్సు ఫలితాలు త్వరలో ప్రజలు ముందుకు రానున్నాయని తెలిపారు. 352 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని, 6.23 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పన జరుగుతుందన్నారు. 11.50 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని జగన్ తెలిపారు.
చీఫ్ సెక్రటరీతో కమిటీ...
ఈ సదస్సు ద్వారా ఏపీ ప్రతిష్ట మరింత పెరిగిందన్నారు. ఐటీ, ఐటీఈఎస్ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీ ఆకర్షణీయమైన పెట్టుబడుల రాష్ట్రంగా తీర్చిదిద్దామన్నారు. చీఫ్ సెక్రటరీతో కూడిన కమిటీ ప్రతి వారం సమావేశమై ఎంవోయూ కుదుర్చుకున్న కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చర్యలు తీసుకుంటుందన్నారు. 117 ఎంవోయూలు ఒక్క పర్యాటకరంగంలోనే కుదిరాయన్నారు. ఏపీపైనా, తమ ప్రభుత్వంపై నమ్మకం ఉంచినందుకు ధన్యావాదు తెలిపారు. ప్రతిపాదనలను అన్నింటిని వెంటనే క్లియర్ చేసేందుకు కమిటీ ప్రయత్నిస్తుందని తెలిపారు.


Tags:    

Similar News