Hyderabad : హైదరాబాద్ లో చెత్త ఈరోజు ఎంత ఉందంటే? జీహెచ్ఎంసీ సిబ్బందికి అగచాట్లే

హైదరాబాద్ లో దీపావళి మరుసటి రోజు ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తుంది.

Update: 2024-11-01 02:27 GMT

diwali in hyderabad

హైదరాబాద్ లో దీపావళి మరుసటి రోజు ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తుంది. నిన్న దీపావళి పండగ కావడంతో టపాసులు కాల్చి ఎక్కడివి అక్కడే వదిలేశారు. వీధుల్లో అంతా టపాసుల మూలాలతో చెత్త నిండిపోయింది. టపాసుల చెత్తతో నగరం అంతా ఒకరకమైన ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్ లో ఏటా వినాయక చవితి నిమజ్జనం రోజు ఎక్కువగా రోడ్ల మీద పేరుకుపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కష్టపడి వాటిని తొలగిస్తారు. దీపావళికి కూడా అంతే స్థాయిలో ఈసారి చెత్త పేరుకుపోయినట్లు తెలుస్తోంది. కొన్ని వేల టన్నుల చెత్తను జీహెచ్ఎంసీ కార్మికులు తొలగించాల్సి ఉంటుంది.

ప్రతి ఇంటి ముందు...
ప్రతి ఇంటి ముందు భాగంలోనూ, రోడ్ల మీద ఈ దీపావళి టపాసుల అవశేషాలు పడి ఉన్నాయి. రాత్రంతా దీపావళి వేడుకలను జరుపుకున్న ప్రజలు రోడ్డు మీద మాత్రం చెత్త పేరుకు పోవడాన్ని గమనించరు. దీపావళి రోజున సాధారణంగా ఇదే జరుగుతుంది. రాత్రంతా టపాసులు కాల్చి ఎవరి దారిన వారు వెళ్లిపోతుంటారు. కానీ ఉదయాన్నే జీహెచ్ఎంసీ సిబ్బంది మాత్రం చెత్తను శుభ్రం చేయడానికి వచ్చి ఈ చెత్తను తొలగించేందుకు అనేక అవస్థలు పడుతుంటారు. ప్రతి రోజూ కొన్ని వేల టన్నుల చెత్త హైదరాబాద్ నగరంలో మామూలుగా వస్తుంది. కానీ ఈరోజు మాత్రం ఇంకా ఎక్కువగా చెత్త పేరుకుపోతుంది.
వీధులన్నీ చెత్తమయం...
వీధులన్నీ చెత్త మయంగా మారడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది వాటిని శుభ్రపర్చేందుకు, తొలగించేందుకు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రతి రోజూ వచ్చే చెత్త కంటే అదనంగా ఈరోజు చెత్త పేరుకుపోయి ఉంటుందని జీహెచ్ఎంసీ సిబ్బంది చెబుతున్నారు. వాటిని తొలగించి వాహనాల్లో నగరం శివారు ప్రాంతాలకు తరలించాలంటే కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. చెత్త నిల్వలను పేరుకుపోయిన తర్వాత దానిని శుభ్రం చేయాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీ దే కావడంతో వారికి పండగ అంటే చెత్త సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి రోజూ ఉత్పత్తి అయ్యే చెత్తకంటే డబుల్ రెట్లు చెత్త నగరంలో పేరుకుపోయిందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News