తెలుగు చిత్ర సీమ అంతా తరలివచ్చింది బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పై తీసిన బయోపిక్ కథానాయకుడు ఆడియో రిలీజ్ కి. ఎన్టీఆర్ బతికున్న కాలంలో రాజకీయంగా ఆయన తో ఢీ అంటే ఢీ అన్నారు సూపర్ స్టార్ కృష్ణ. కానీ ఆయన కథానాయకుడు ఆడియో రిలీజ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఎన్టీఆర్ తో తనకు వున్న అనుబంధాన్ని చెప్పి తామిద్దరి నడుమ సిద్ధాంతపరమైన వైరుధ్యాలు తప్ప మరేమి లేవన్నది క్లారిటీ ఇచ్చేశారు. ఇక మిగిలిన వారంతా ఎన్టీఆర్ తో సాన్నిహిత్యం వున్న వారు. వీరందరి రాకతో బాలయ్య బాబు ఫంక్షన్ సూపర్ హిట్ అయ్యింది. అయినా ఎక్కడో వెలితి ఆ కార్యక్రమం చూసినవారందరికి కనిపించింది. అదే మెగాస్టార్ చిరంజీవి ఈ చారిత్రక ఆడియో రిలీజ్ లో కనిపించకపోవడం.
నాగబాబు వివాదం తో ...
పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదంటూ ఒక సందర్భంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పీకే ఫ్యాన్స్ ను మెగా ఫ్యామిలీని హర్ట్ చేశాయి. దీనికి ప్రతీకారంగా పవన్ సోదరుడు నాగబాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణ ను అవహేళన చేస్తూ ఒక కామెంట్ చేశారు. బాలయ్య అంటే తనకు హాస్యనటుడు తెలుసునని మరెవరూ తెలియదన్నట్లు కామెంట్ చేసి కాక రేపారు. నాగబాబు చేసిన వ్యాఖ్యలపై బాలయ్య ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఇలా ఇరు శిబిరాల అభిమానులు ఒకరంటే మరొకరు రగిలిపోతూ వున్న సందర్భంలో పవన్ సైతం తన బహిరంగ సభల్లో బాలకృష్ణ పై ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి బాలయ్య కథానాయకుడు బయోపిక్ కి రావడం అనుమానమే అన్నది అందరు అనుకున్నదే.
అసలు ఏం జరిగింది అంటే ...
వాస్తవానికి ఈ టీ కప్పులో తుఫాన్ లాంటి వివాదాలు పక్కన పెట్టి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని తన కార్యక్రమానికి సాదరంగా ఫోన్ లో ఆహ్వానించారట. అయితే సైరా షూటింగ్ లో బిజీగా ఉండటంతో బాటు హైదరాబాద్ కి దూరంగా ఉండటం వల్ల రాలేకపోతున్నాని చిరంజీవి చెప్పారని అంటున్నారు. అయితే ఈ విషయాలేమి బయటకు రాకపోగా నందమూరి, మెగా కుటుంబాల నడుమ వార్ నడుస్తుందన్నట్లు సోషల్ మీడియా లో వైరల్ అయిపోతున్నాయి వార్తలు. తెలుగు ఇండస్ట్రీ లో ఎన్టీఆర్ ప్రస్థానం సువర్ణాక్షరాలతో లిఖించేది అయితే ఆయన తరువాత అంతటి గుర్తింపు తెచ్చుకున్నది మెగాస్టార్ చిరంజీవి అన్నది నిర్వివాదాంశం. అయితే ఎన్టీఆర్ అటు వెండితెర ఇటు పొలిటికల్ స్క్రీన్ లపై క్లిక్ అయితే చిరంజీవి వెండితెరపై వెలిగి రాజకీయాల్లో మాత్రం దెబ్బతిన్నారు. అయినప్పటికీ ఎన్టీఆర్ జీవిత చరిత్రపై విడుదల అవుతున్న కథానాయకుడు ఆడియో రిలీజ్ లో మెగాస్టార్ లేని లోటు లోటే గా