ఆచార్య క్లాస్ మనసును మార్చేస్తుందా?

చిరంజీవి నేడు జగన్ ను కలవనున్నారు. దీంతో సినిమా టిక్కెట్ల వివాదానికి నేటితో తెరపడుతుందని చిత్ర పరిశ్రమ భావిస్తుంది.

Update: 2022-01-13 04:49 GMT

మెగాస్టార్ చిరంజీవి నేడు ముఖ్యమంత్రి జగన్ ను కలవనున్నారు. దీంతో సినిమా టిక్కెట్ల వివాదానికి నేటితో తెరపడుతుందని చిత్ర పరిశ్రమ భావిస్తుంది. ఇప్పటి వరకూ మూవీ టిక్కెట్ల వివాదంలో చర్చ ముఖ్యమంత్రి జగన్ వరకూ వెళ్ల లేదు. మంత్రి పేర్ని నాని మాత్రమే చిత్ర పరిశ్రమ ప్రతినిధులతో చర్చలు జరుపుతూ వస్తున్నారు. సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తే పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని అత్యధిక శాతం మంది చిత్ర పరిశ్రమలో అభిప్రాయపడుతున్నారు.

జగన్ వరకూ వెళ్లి....
కానీ జగన్ వరకూ వెళ్లి ఇంతవరకూ ఎవరూ చర్చించలేదు. అయితే తాము ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోరినా దొరకలేదని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. మరోవైపు పెద్ద సినిమాలు కూడా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. వర్మలాంటి వాళ్లు మంత్రి పేర్ని నానితో చర్చించినా సమస్యకు తెరపడదన్న సంగతి అందరికీ తెలిసిందే. కేవలం చర్చలతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని చిత్ర పరిశ్రమలో ప్రముఖులు సయితం అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
సినీ పరిశ్రమపై....
మరోవైపు సినిమా హాళ్లు వివిధ కారణాలతో మూతపడ్డాయి. దీంతో చిత్ర పరిశ్రమలో పెద్దన్న గా చిరంజీవి ముందుకు వచ్చారు. జగన్ తో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. చిరంజీవి కేవలం సినిమాపరంగానే కాకుండా రాజకీయంగా కూడా ఆయనకు ప్రాముఖ్యత ఉంది. జగన్ ను గతంలోనూ చిరంజీవి కలిశారు. ఆయనతో కలిసేందుకు జగన్ కు ఎటువంటి ఇబ్బందులుండవు. ఇరువురి మధ్య అరమరికలు లేకుండా చర్చలు జరిగే అవకాశముంది.
తాత్కాలికంగానైనా....?
ఈ పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమలో నెలకొన్న టిక్కెట్ల సమస్యకు తాత్కాలికంగానైనా ఈ చర్చలు తెరవేస్తాయన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతుంది. చిరంజీవి ఇతరులు మాదిరి కాదు. మాట తూలరు. ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు ఇతరులు మాదిరి చేయరు. అందుకే జగన్ అడిగిన వెంటనేే అపాయింట్ మెంట్ ఇచ్చారు. చిరంజీవి మాటకు గౌరవమిచ్చి జగన్ మూవీ టిక్కెట్ల విషయంలో వెనక్కు తగ్గుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News