నిత్య పెళ్లికొడుకు అవతార మెత్తి అమాయక మహిళలను మోసం చేస్తూ, అక్రమ కేసులు నమోదు చేస్తానని ఓ సీఐ బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. నారాయణ గూడెం గ్రామానికి చెందిన కొలుకపల్లి రాజయ్య ఇన్సిపెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మొదట ఆయన తన మేనత్త కూతురు సైదమ్మ ను వివాహం చేసుకున్నాడు. అనంతరం కోదాడకు చెందిన శ్రీవాణిని పెళ్లిచేసుకొని ఇద్దరికీ దూరంగా ఉంటూ ఇద్దరి మహిళలను పెళ్లి చేసుకున్నట్లు విషయం గోప్యంగా ఉంచి, తాండూరుకు చెందిన రేణుక అనే మహిళ ను 2009 మేలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
నాలుగో పెళ్లికి సిద్ధమై...
వీరికి ముగ్గురు కుమారులు సంతానం కలిగిన తర్వాత రేణుకను మహబూబ్ నగర్ లో, పరిగిలో, మన్సూరాబాద్ లో నివాసం ఉంచాడు. తరుచూ రేణుకతో ఘర్షణకు దిగడం, కుటుంబ యోగక్షేమాలు పట్టించుకోకపోవడంతో రేణుక పలుమార్లు అతడిని నిలదీసింది. అయితే, ప్రవర్తన మార్చుకోని రాజయ్య తిరిగి భార్యపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరిస్తున్నాడు. భర్త వేదింపులు తాళలేని రేణుక ఇవాళ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెను పెళ్లి చేసుకునేందుకే రాజయ్య ఇలా చేస్తున్నాడని, ఆయనపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.