తెలంగాణ కాంగ్రస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు ముగియగానే మరో తాజా మాజీ ఎమ్మెల్యే అవినీతి చిట్టా చర్చనీయాంశమవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని తాజా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు పై ఆదాయ పన్ను శాఖ, సీబీఐ, ఈడీ అధికారులకు ఫిర్యాదు అందింది. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని రూ.900 అక్రమంగా సంపాదించారని ఆయనపై సత్యనారాయణ అనే వ్యక్తి ఇటీవల ధర్యాప్తు సంస్థలతో పాటు కోర్టునూ ఆశ్రయించారు. ఐదేళ్లలో పుట్టా మధు ఆస్తులు ఎన్నో రెట్లు పెరిగాయని ఆరోపించారు. తన తల్లి పేరుతో ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి కూడా కోట్లు వసూళ్లు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ప్రధాన రహదారిపై రూ.5 కోట్ల విలువ చేసే ఇల్లు కొన్నారని పేర్కొన్నారు. మొత్తంగా రూ.900 కోట్ల ఆక్రమ ఆస్తులను పుట్టా మధు కూడబెట్టారని, ఆయనపై విచారణ జరిపించాలని పిటీషనర్ కోరారు.