తెలంగాణలో ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల లొల్లిని కొంత తగ్గించేందుకు ఓ కొత్త నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని ఒకవేళ ఓడిపోతే మళ్లీ ఎంపీలుగా పోటీ చేయవచ్చు అనుకుంటున్న నేతలకు షాక్ తగలనుంది. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ స్థానాలకు కూడా ఇప్పుడే అభ్యర్థులను ఖరారు చేయాలని పార్టీ భావిస్తోంది. ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిన వారికి మళ్లీ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని నిర్ణయిందని సమాచారం. దీంతో ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిస్తే మంత్రి కావాలని, ఓడితే తర్వాత వచ్చే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ కావాలని వ్యూహాలు రచిస్తున్న కొందరు నేతలకు షాక్ తగలనుంది.