ఇండియా కూటమిలో బాత్‌రూమ్‌ ముసలం!

అసలే గోరుచుట్టు. దానిపై రోకటి పోటు అన్నట్లుంది ఇండియా కూటమి తీరు. రకరకాల సిద్ధాంతాలు, రాద్ధాంతాలు ఒకేచోట చేరి, కలిసి పెట్టుకున్న పొత్తుల కుంపటి అది. ఇటీవల జరిగిన నాలుగు ప్రధాన రాష్ట్రాల ఎన్నికల్లో ఆ కూటమికి మూడు చోట్ల తలబొప్పి కట్టింది. తర్వాత జరిగిన అన్ని పార్టీల సమావేశంలో మరో వివాదం చెలరేగి, ప్రస్తుతం అది బాత్‌రూమ్‌ల దగ్గరకు చేరింది.

Update: 2023-12-25 06:31 GMT

 India bloc

అసలే గోరుచుట్టు. దానిపై రోకటి పోటు అన్నట్లుంది ఇండియా కూటమి తీరు. రకరకాల సిద్ధాంతాలు, రాద్ధాంతాలు ఒకేచోట చేరి, కలిసి పెట్టుకున్న పొత్తుల కుంపటి అది. ఇటీవల జరిగిన నాలుగు ప్రధాన రాష్ట్రాల ఎన్నికల్లో ఆ కూటమికి మూడు చోట్ల తలబొప్పి కట్టింది. తర్వాత జరిగిన అన్ని పార్టీల సమావేశంలో మరో వివాదం చెలరేగి, ప్రస్తుతం అది బాత్‌రూమ్‌ల దగ్గరకు చేరింది.

నాలుగు రోజుల కిందట ఇండియా బ్లాక్‌ సమావేశం జరిగింది. అందులో బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ హిందీలో మాట్లాడుతున్నారు. తమిళనాడులోని డీఎంకే పార్టీ ఎంపీ టీయార్‌ బాలుకి హిందీ రాదు. నితీష్‌ ఏం మాట్లాడుతున్నారంటూ పక్కనున్న మరో ఎంపీని అడిగారు. దీనిపై నితీష్‌కు కోపం వచ్చింది. హిందీ మన జాతీయ భాష, అది రాకపోతే ఎలా అంటూ బాలుపై అసహనం వ్యక్తం చేశారు.

‘మా రాష్ట్రంలో ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌ వాళ్లు బాత్‌రూమ్‌లు కడుగుతారు,’ అంటూ హిందీ మాట్లాడటం గొప్ప విషయం కాదని డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌: కౌంటర్‌ ఇచ్చారు. దక్షిణాదిపై హిందీని రుద్దడాన్ని మొదట్నుంచీ తమిళనాడు వ్యతిరేకిస్తోంది. హిందీ అర్థం కాదని తమ ఎంపీని కించపరుస్తూ మాట్లాడటంపై మారన్‌ అందుకే గట్టిగా స్పందించారు.

ఈ వివాదాన్ని కొనసాగిస్తూ బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ దయానిధిపై విరుచుకుపడ్డారు. బిహారీలు లేకపోతే ఇతర రాష్ట్రాలన్నీ స్తంభించిపోతాయన్నారు. యూపీ, బిహార్‌ వ్యక్తులను విమర్శించడం సరికాదు. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన కార్మికులకు దేశవ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. అన్ని పార్టీల నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిదని ఆయన హితవు పలికారు. ఇదండీ ఇండియా బ్లాక్‌లో పార్టీల సమన్వయం. సహకారం!

Tags:    

Similar News