లాక్ డౌన్ కొనసాగిస్తారు కాని సడలింపులుంటాయట

భారత్ లో కరోనా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ భారత్ లో 239 మంది మరణించారు. 7447 మంది ఇప్పటి వరకూ కరోనా వ్యాధి [more]

Update: 2020-04-11 03:53 GMT

భారత్ లో కరోనా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ భారత్ లో 239 మంది మరణించారు. 7447 మంది ఇప్పటి వరకూ కరోనా వ్యాధి బారిన పడ్డారు. క్రమంగా కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కల్గిస్తుంది. దీంతో ఈరోజు ప్రధాని మోదీ ముఖ్య మంత్రులతో మాట్లాడనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తీసుకోనున్నారు. లాక్ డౌన్ కొనసాగింపు పై ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశముంది. కొన్ని సడలింపులు ఇచ్చి లాక్ డౌన్ ను కంటిన్యూ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రాల మధ్య రాకపోకలపై మాత్రం నిషేధం కొనసాగుతుందని తెలుస్తోంది. హాట్ స్పాట్ ప్రాంతాలు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Tags:    

Similar News