హై అలర్ట్.. కరోనా మళ్లీ అంటుంకుంటుంది
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.వైరస్ తగ్గిందని భావిస్తున్న సమయలో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా వైరస్ తగ్గిందని భావిస్తున్న సమయలో కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్ లో 344 కరోనా కేసుల సంఖ్య నమోదయింది. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల ఇప్పటి వరకూ 4,46,86,361కు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తాజాగా వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా...
ఈరోజు వరకూ దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 2,229 ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. పాజిటివిటీ రేటు 98.06 శాతంగా నమోదయింది. అయితే ఆరుగురు మరణించడం కూడా ఆందోళన కలిగించే విషయమే. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా చికిత్స పొంది 258 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,30,770కి చేరుకుంది.
నిబంధనలను....
దేశంలో కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 4,41,53,203గా నమోదయింది. కరోనా తగ్గిందని నిర్లక్ష్యం చేయవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే మరలా కరోనా వైరస్ పెరిగే అవకాశముందని భారత ప్రభుత్వం హెచ్చరిస్తుంది. అన్ని రాష్ట్రాలూ కూడా కరోనా నిబంధనలను అప్రమత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది.