తెలియకుండానే ఆవిరి చేస్తున్నారు
నయా మోసానికి తెరలేపారు సైబర్ నేరగాళ్లు….అత్యాధునిక టెక్నాలజీని బేస్ చేసుకొని సొమ్ము చేసుకునే ప్లాన్ వేశారు కేటుగాళ్లు. పెట్రోల్ బంకుల్లో ఇంటిజిట్లర్టేడ్ చిప్‌లు అమర్చి పెద్ద ఎత్తున [more]
నయా మోసానికి తెరలేపారు సైబర్ నేరగాళ్లు….అత్యాధునిక టెక్నాలజీని బేస్ చేసుకొని సొమ్ము చేసుకునే ప్లాన్ వేశారు కేటుగాళ్లు. పెట్రోల్ బంకుల్లో ఇంటిజిట్లర్టేడ్ చిప్‌లు అమర్చి పెద్ద ఎత్తున [more]
నయా మోసానికి తెరలేపారు సైబర్ నేరగాళ్లు….అత్యాధునిక టెక్నాలజీని బేస్ చేసుకొని సొమ్ము చేసుకునే ప్లాన్ వేశారు కేటుగాళ్లు. పెట్రోల్ బంకుల్లో ఇంటిజిట్లర్టేడ్ చిప్‌లు అమర్చి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు, ఎస్ఓట్ టీమ్స్ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పట్టుకున్నారు. ఏటూరుకు చెందిన సుబానీ భాషా మరో ముగ్గురితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. 2019లో టెక్నాలజీని బేస్ చేసుకొని పెట్రోల్ బంకుల్లో చిప్ అమర్చి లక్షలు సంపాదించే స్కెచ్ వేశారు. ఇంకేముంది అనుకున్న విధంగానే రాష్ట్రంలో 11 బంకుల్లో చిప్ లు అమర్చి క్యాష్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇంటిజిట్లర్టేడ్ చిప్‌ల ద్వారా 1000 ఎమ్ఎల్ లో 970 ఎమ్ ఎల్ మాత్రమే వస్తుందని, వాహనాల్లో పెట్రోల్ పోసేటప్పుడు డిస్ ప్లే వెనుక ఒక చిప్ అమర్చుతారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. లీగల్ మెట్రాలజీ, పోలీసులు చెక్ చేసినా దొరకకుండా ఒక మదర్ బోర్డు కూడా తయారుచేశారని అన్నారు. ఈ విధంగా హైదరాబాద్‌లోని 11 బంకుల్లో 13 చిప్పులను అమర్చారని సజ్జనార్ పేర్కొన్నారు. ఏపీ పోలీసులకు కూడా ఈ సమాచారం ఇచ్చామని, మొత్తం తెలంగాణలో 11, ఏపీలో 22 బంకుల్ని సీజ్ చేసినట్లు చెప్పారు.
ఏపీలోనూ….
ముంబైకి చెందిన జోసఫ్, థామస్ అనే వ్యక్తుల ద్వారా చిప్స్ ని తయారు చేయించారని నిందితులు విచారణలో ఒప్పుకున్నట్లు సీపీ తెలిపారు. ఏపీలోని పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో చిప్స్ ను అమర్చినట్లు విచారణలో తేలిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక తమిళనాడులోనూ వీళ్ళు చిప్ లు పెట్టి ఉండవచ్చని.. బంకు ఓనర్లకు ఇదంతా తెలిసే జరుగుతుందని …అవసరమైతే వారి పై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ అన్నారు. తెలంగాణలో 4 బీపీసీఎల్, 2 హెచ్ పీసీఎల్, 5 ఐఓసీఎల్ బంకుల్లో చిప్పులు అమర్చారని ప్రస్తుతం వాటిని సీజ్ చేశామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో ఐదుగురు బంక్ యజమానులు మరియు ఇద్దరు పరికరాలను సప్లై చేసిన వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుండి 14 ఐసీఎస్ చిప్స్, 8 డిస్ ప్లేలు, 3 జీబీఆర్ కేబుల్స్, 1 మదర్ బోర్డు, ఐ20 కారు స్వాధీనం చేసుకున్నారు.