హైదరాబాద్ కు విదేశీ ప్రతినిధులు
కరోనా వ్యాక్సిన్ తయారీ ఉత్పత్తి విధానాన్ని తెసుకునేందుకు 85 దేశాలకు చెందిన ప్రతినిధులు హైదరాబాదుకు వచ్చారు. కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు [more]
కరోనా వ్యాక్సిన్ తయారీ ఉత్పత్తి విధానాన్ని తెసుకునేందుకు 85 దేశాలకు చెందిన ప్రతినిధులు హైదరాబాదుకు వచ్చారు. కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు [more]
కరోనా వ్యాక్సిన్ తయారీ ఉత్పత్తి విధానాన్ని తెసుకునేందుకు 85 దేశాలకు చెందిన ప్రతినిధులు హైదరాబాదుకు వచ్చారు. కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. హైదరాబాద్ లోని జినేమీ వ్యాలీ లో ఉన్న భారత్ బయోటెక్ తో పాటుగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఫార్మా కంపెనీలను విదేశీ ప్రతినిధులు విజిట్ చేస్తారు. అక్కడ కరోనా వ్యాక్సిన్ తయారీ ,ఉత్పత్తికి సంబంధించిన విషయాలను తెలుసుకుంటారు. అంతేకాకుండా వ్యాక్సిన్ రవాణాకు సంబంధించిన ప్రధాన సమస్య ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలను సంబంధిత సంస్థ ప్రతినిధుల నుండి తెలుసుకునే అవకాశం ఉంది. అయితే దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తయారీ ఉత్పత్తి హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలోనే విదేశీ ప్రతినిధులు హైదరాబాద్ చేరుకొని రెండు ఫార్మా కంపెనీలను సందర్శించడం ఇప్పుడు విశిష్టత సంతరించుకుంది. అయితే ఇప్పటికే దేశ ప్రధాని మోడీ ఈ ఫార్మా కంపెనీలను విజిట్ చేసి కరోనా వ్యాక్సిన్ తయారీ ఉత్పత్తులను పరిశీలించారు. త్వరలోనే దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్తున్నారు.