Delhi : ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు… సుప్రీం ఆదేశాలతో….?

ఢిల్లీ ప్రభుత్వం వాయు కాలుష్యంపై కఠిన చర్యలు తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తక్షణ చర్యలకు ఉపక్రమించింది. రేపటి నుంచి 17వ తేదీ వరకూ నిర్మాణ పనులను నిలిపేయాలని [more]

Update: 2021-11-13 13:00 GMT

ఢిల్లీ ప్రభుత్వం వాయు కాలుష్యంపై కఠిన చర్యలు తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తక్షణ చర్యలకు ఉపక్రమించింది. రేపటి నుంచి 17వ తేదీ వరకూ నిర్మాణ పనులను నిలిపేయాలని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం కు పరిమితమవ్వాలను తగ్గించింది. వాహన రాకపోకలను తగ్గటించాలని భావిస్తుంది.

వాయు కాలుష్యంతో…..

దీపావళి పండగ తర్వాత ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగిపోయింది. ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 పాయింట్లుగా దాటింది. దీనిపై సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. ఇంట్లో కూడా మాస్క్ లు పెట్టుకోవాలని అభిప్రాయపడింది. రేపటి నుంచి వారం రోజుల పాటు విద్యాసంస్థలను కూడా మూసివేయాలని నిర్ణయించింది. దేశంలోనే కాలుష్యనగరంగా ఢిల్లీ ఉంది.

Tags:    

Similar News