బ్రేకింగ్ : అందుకే రాజీనామా చేస్తున్నా

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. తమకు తగిన సంఖ్యాబలం లేనందునే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఫడ్నవిస్ తెలిపారు. శివసేనవి బ్లాక్ మెయిల్ రాజకీయాలన్నారు. [more]

Update: 2019-11-26 10:23 GMT

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. తమకు తగిన సంఖ్యాబలం లేనందునే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఫడ్నవిస్ తెలిపారు. శివసేనవి బ్లాక్ మెయిల్ రాజకీయాలన్నారు. తమతో కలసి పోటీ చేసి గెలిచి ప్రజామోదం పొందాక ముఖ్యమంత్రి పదవి కోరిందన్నారు. బీజేపీ ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవి ఇస్తామని శివసేనకు మాట ఇవ్వలేదన్నారు. తక్కువ స్థానాలు వచ్చినా శివసేన బీజేపీపై బెదిరింపులకు దిగిందన్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లు భిన్న సిద్ధాంతాలున్న పార్టీలన్నారు.

ప్రతిపక్షనేతగానే ఉంటా….

తాను శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తానని చెప్పారు. ప్రజలు తమ కూటమికే మద్దతిచ్చినా శివసేన మోసం చేసిందన్నారు. ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా అజిత్ పవార్ తమతో చేతులు కలిపారన్నారు. ఎన్సీపీ మొత్తం తమతో కలసి వస్తుందని అనుకున్నామన్నారు. అందుకే గవర్నర్ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారని చెప్పారు. మరికాసేపట్లో దేవేంద్ర ఫడ్నవిస్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేయనున్నారు. ఇంతకు ముందే అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బలపరీక్షకు ముందే బీజేపీ తప్పుకోవడంతో శివసేన కూటమిని గవర్నర్ ఆహ్వానించే అవకాశముంది.

Tags:    

Similar News