స‌మంత అమెరికా వెళ్ళింది చికిత్స కోసమా..? ''ఆంక్షలతో కొత్త ప్రేమ'' పోస్ట్ వైరల్..!

టాలీవుడ్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ (Myositis) అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే.

Update: 2023-08-20 06:21 GMT

టాలీవుడ్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ (Myositis) అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. దానిని నుంచి పూర్తిగా కోలునేందుకు.. ఒక ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి చికిత్స తీసుకోవాలని సామ్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకనే ప్రస్తుతం తన చేతిలో ఉన్న ఖుషి (Kushi), సిటాడెల్ (Citadel) షూటింగ్స్ పూర్తి చేసి మరే ఇతర కొత్త ప్రాజెక్ట్ లకు సైన్ చేయడం లేదు.

మయోసైటిస్ చికిత్స కోసం సమంత త్వరలోనే అమెరికా వెళ్లనుందని, పూర్తిగా కోలుకునే వరకు అక్కడే ఆమె ఉండనుందని వార్తలు వినిపించాయి. ఇక మొన్నటి వరకు హాలీడే వెకేషన్ ని ఎంజాయ్ చేసిన సమంత.. ఇటీవల 'ఖుషి' మ్యూజిక‌ల్ కాన్స‌ర్ట్‌ కి అటెండ్ అయ్యి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. అయితే ఆ ఈవెంట్ అవ్వగానే సమంత తన తల్లితో కలిసి అమెరికా ప్రయాణం అయ్యింది. ఎయిర్ పోర్ట్ లో సామ్ తన తల్లితో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తల్లితో కలిసి సమంత అమెరికా వెళ్తుండడంతో చికిత్స కోసమే అనుకుని.. ఆమె త్వరగా కోలుకొని తిరిగి రావాలంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు పోస్టులు వేస్తున్నారు. అయితే సమంత అమెరికా వెళ్ళింది చికిత్స కోసం కాదట. ఈ నెల 20న న్యూయార్క్ న‌గ‌రంలో భార‌త స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ర‌వికిష‌న్‌, జాక్వైలిస్ ఫెర్నాండేజ్‌లతో పాటు సమంతకి కూడా ఆహ్వానం అందిందట. అందుకోసమే సమంత అమెరికా వెళ్లినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

ఇది ఇలా ఉంటే, అమెరికాలో ఉన్న సమంత తన ఇన్‌స్టా స్టోరీలో ఒక పోస్ట్ పెట్టింది. "కొత్త ఆవిష్కరణల మధ్య కొత్త ఆంక్షలతో కొత్త ప్రేమ ఏర్పడింది" అంటూ ఒక ఫోటో షేర్ చేస్తూ రాసుకొచ్చింది. ఇంతకీ సమంత కొత్తగా దీని పై మనసు పారేసుకుందో తెలుసా..? కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ తో ఉన్న కార్బోనేటేడ్ వాటర్ పై సమంతకి కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ వాటర్ గురించి సింపుల్ గా చెప్పాలి అంటే 'సోడా వాటర్'. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Tags:    

Similar News